శ్రీ మట్టా పశుపతి వ్యాపారవేత్త మరియు ఢిల్లీ తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ముఖ్యంగా తూర్పు ఢిల్లీ తెలుగు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. పేద ప్రజలకు అనేక సేవలందిస్తున్న నిరాడంబరుడు.
శ్రీ సిలార్ ఖాన్ 1990 నుండి ఆంధ్రా అసోసియేషన్ తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రా అసోసియేషన్ ట్రస్ట్రీ సెక్రటరీ గా సేవలందిస్తున్నారు. అసోసియేషన్ ప్రత్యేక ఆహ్వానితునిగా,సహ సభ్యునిగా, కార్యవర్గ సభ్యునిగా,రెండు సార్లు ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ఆయన అనేక సామాజిక, సాంస్కృతిక సంస్థలతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఢిల్లీ మరియు ఢిల్లీ పరిసర ప్రాంత తెలుగు ప్రజలకు అనేక సేవలందించారు.