ఢిల్లీ ప్రజలకు సుపరిచిత వ్యక్తి, నిరాడంబరుడు, సామాజిక కార్యకర్త శ్రీ ఆర్. మణి నాయుడు గారు. ఆయన అనేక సామాజిక , సాంస్కృతిక , స్వచ్ఛంద సంస్థలతో అనుబంధం కలిగిన వ్యక్తి. అంతేకాక “పంచతత్వం” అనే స్వంచ్ఛంద సేవాసంస్థను స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించారు. ఈ సంస్థ ద్వారా చనిపోయిన నిరుపేదల దహన సంస్కారాలకు ఆర్థిక సహాయ, సహకారాలను అందించారు. ఎనలేని సామాజిక సేవ చేసి ఎన్నో అవార్డులను అందుకున్నారు. “కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ (మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్,గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) సభ్యునిగా సేవలందించారు.గ్లోబల్ ఇండియా పౌండేషన్ వ్యవస్థాపక సభ్యునిగా ఉన్నారు.
శ్రీ ఆర్. మణినాయుడు గారు దాదాపు 50 దేశాలలో విస్తృతంగా పర్యటించారు. తెలుగు,ఆంగ్లం, హిందీ,తమిళం మరియు మళయాళం భాషలలో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆయనకు వివిధ క్రీడలలో ప్రవేశం కలదు. జిల్లా మరియు రాష్ట్రస్థాయిలలో అనేక పతకాలను గెలుచుకొన్నారు. ఆయన Human Rights లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ఇంటర్ నేషనల్ మార్కెటింగ్ లో MBA చేశారు. ప్రస్తుతం ఆంధ్రాఅసోసియేషన్ అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు.
అత్యంత అనుభవశీలి, ప్రజాదరణ కలిగిన వ్యక్తి శ్రీ కోటగిరి సత్యనారాయణ. BSNL జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసి, ఆంధ్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ ప్రజలకు సేవలందిస్తున్నారు.ఆయన కృషి ఫలితంగా ఢిల్లీ నలుమూలలా ఉన్న తెలుగువారు అధిక సంఖ్యలో ఆంధ్రా అసోసియేషన్ లో సభ్యత్వం పొంది వివిధ సదుపాయాలను పొందుతున్నారు. ఆంధ్రా అసోసియేషన్ ఏర్పడిన తొలినాళ్ళలో బ్రాంచ్ కార్యదర్శిగా పనిచేశారు.అనంతరం ఆంధ్రా అసోసియేషన్ కేంద్ర కమిటీకి ఎన్నుకోబడి కోశాధికారి, అధ్యక్షుడు మొదలైన వివిధ స్థాయిలలో సేవలందించారు. ఆయన అకుంఠిత దీక్షతో ఆంధ్రాఅసోసియేషన్ ఉన్నత స్థాయికి చేరుకుంది.
వృత్తి రీత్యా వ్యాపారవేత్త అయిన శ్రీ మంచిరాజు లహరి 1999 నుండి ఆంధ్రా అసోసియేషన్ లో సేవలందిస్తున్నారు.ఆయన నిజాయితీ పరుడు, నిరాడంబరుడు. ఢిల్లీ యువతకు సుపరిచితమైన వ్యక్తి. క్రీడల పట్ల అమితాసక్తి కలిగిన ఆయన అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడలను నిర్వహించి ఢిల్లీ తెలుగు యువతను ఒక తాటిపైకి తెచ్చారు.మొదట్లో బ్రాంచ్ చైర్మన్ గా సేవలందించారు.అనంతరం 2014 నుండి అసోసియేషన్ కోశాధికారిగా సేవలందిస్తున్నారు.