ప్రతి సంవత్సరం పేద మరియు ప్రతిభావంతులైన తెలుగు విద్యార్థులకు 30 లక్షల విలువైన ఉపకారవేతనాలను పంపిణీ చేయడం జరుగుతుంది.
పేదతెలుగు కుటుంబాలలో మరణించినవారి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందించడం
జరుగుతుంది.
పేద తెలుగు కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు
ఆర్థిక సహాయం అందించడం
జరుగుతుంది.
దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద తెలుగు కుటుంబాల వారికి వైద్య సహాయంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది.
తెలుగు ప్రజల సౌకర్యార్థం ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఢిల్లీ తెలుగు యువత కోసం ప్రతీ సంవత్సరం ఇండోర్ మరియు అవుట్ డోర్ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది.
రామనవమి, మహా శివరాత్రి, గణేశపూజ, దసరా, దీపావళి, క్రిస్మస్, ఈస్టర్ మరియు రంజాన్ మొదలైన అన్ని మతాల పండుగలను నిర్వహించడం జరుగుతుంది.
ఢిల్లీ ప్రజలకు సుపరిచిత వ్యక్తి, నిరాడంబరుడు, సామాజిక కార్యకర్త శ్రీ ఆర్. మణి నాయుడు గారు. ఆయన అనేక సామాజిక , సాంస్కృతిక , స్వచ్ఛంద సంస్థలతో అనుబంధం కలిగిన వ్యక్తి. అంతేకాక “పంచతత్వం” అనే స్వంచ్ఛంద సేవాసంస్థను స్థాపించి.... Read More
ఆంధ్రా అసోసియేషన్ ఢిల్లీ తెలుగువారి సౌలభ్యం కోసం మ్యారేజ్ బ్యూరోను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అసోసియేషన్ సభ్యుల యొక్క వివాహ వయసు గల కుమారుడు/ కుమార్తెలకు పెళ్ళి సంబంధాలను సమకూర్చడంలో సహాయపడడానికి ఈ మ్యారేజ్ బ్యూరోను ప్రారంభించింది
అసోసియేషన్ సభ్యులనుండి సవివరమైన వివరాలు సేకరించి, కార్యాలయంలో భద్రపరచి, సభ్యుల కుమారుడు/ కుమార్తెల పెళ్ళి సంబంధాలు కుదర్చడంలో ఈ మ్యారేజ్ బ్యూరో సహాయపడుతుంది.
చిన్న సంస్థగా ప్రారంభమైన ఆంధ్రా అసోసియేషన్ తెలుగు వారి సౌలభ్యం కోసం, పెరుగుతున్న వారి అవసరాలకోసం నిరంతరం తన రూపురేఖలను మార్చుకుంటూ దినదినప్రవర్థమానంగా వెలుగొందుతూ గొప్ప సంస్థగా రూపుదిద్దుకుంది.ఢిల్లీ వ్యాప్తంగా అనేక శాఖలను కలిగి ఉండి తెలుగు ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తుంది.